16, మార్చి 2011, బుధవారం

అంతులేని అత్యాచార కధలు

ఈ రోజు ఈనాడు కరీంనగర్ జిల్లా ఎడిషన్ లో ప్రచురితమైన వార్త ఇది.
చెరలో యువతి- పది రోజులుగా అత్యాచారం - పోలీసుల అదుపులో నిందితుడు

జుగుప్సాకరమైన ఘటన ఇది.

ఒక మైనర్ యువతిని నిర్భంధించి బెదిరించి పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన రాక్షసుడు
ఏమి చెయ్యాలి వీడిని

పోలీసు యంత్రాంగం వైఫల్యం లేదు గనుక   ప్రాధమిక దర్యాప్తు ముగించి కోర్టు కు వేస్తారు
ఇహ కోర్టు విచారణ ఇంత కంటే నరకముగా వుంటుంది
నిందితుడు నేరాన్ని అంగీకరించినా మన వాళ్ళు  సెక్షన్ల తో మేధో మధనం చేస్తారు
మన న్యాయ వ్యవస్థకు   నేర విచారణ ఒక సుధీర్ఘమైన మేధో క్రీడా విన్యాసం
విచారణ క్రమంలో నిత్యం నేరస్తుడి మీద డిఫెన్స్ వాళ్ళు విరుచుకు పడడం వల్లనో  ఏమో లేదా శిక్ష విధిస్తే  నిందితుడి భవిష్యత్ ఏమై పోతుందో అని చివరి నిముషములో మళ్ళీ ఒక మారు తీర్పు పునః సమీక్షించుకొని తీర్పు వెలువరిస్తారు
భాదితుడి లేదా భాదితురాలి వర్తమానం కంటే దోషి భవిష్యత్తు మీద ఎక్కువ ఆలోచనలు ప్రసరింప చేస్తారు
ఇలాంటి  సందర్భాలలో భాదితురాలికి జరిగిన  అన్యాయం తీవ్రమైనది  తక్షణ ఉపశమానికి అర్హమైనది
కనీసం కొన్ని రోజులపాటు  భాదితురాలి గురించి మాత్రమే ఆలోచించాలి విచారణ మరియు న్యాయ ప్రక్రియలు , శిక్షలతో నిమిత్తం లేకుండా తక్షణం భారీగా ఆర్ధిక  సహాయం అందించాలి నైతిక స్టెయిర్యం కలిగించేలా ప్రభుత్వ ప్రక్రియలు వుండాలి

(ఈ సందర్భములో ఒక విషయం ప్రస్తావిస్తాను  కౌన్సిలింగ్ అని చేస్తుంటారు ఇది ఒక పెద్ద ప్రహసన ప్రక్రియ )
దీనిని ప్రభుత్వ వైఫల్యానికి తక్షణ మూల్యముగా భావించాలి తీర్పు అనంతరం మిగిలిన పునరావాస ప్రక్రియలు ఆర్ధిక తోడ్పాటు అందించాలి
నిందితుడికి పడబోయే శిక్ష కేవలం  ఇతర ఇలాంటి తరహా నేరస్తులకు భయం కలిగించేలా వుండాలి అంటే తప్ప నిందితుడికి ఎలాంటి శిక్ష విధించిన భాదితురాలికి న్యాయం జరిగినట్టుగా భావించలేము ఆఖరికి ఉరి శిక్ష కూడా.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి